నేడు ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులకు గ్రీవెన్స్

GNTR: ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేయడానికి ఫిర్యాదులు, అర్జీలు అందజేయడానికి శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్మికులు ప్రధానంగా పీఎఫ్, ఈఎస్ఐ, రుణాలు, ఆప్కాస్ తదితర అంశాలపై తమ సమస్యలను గ్రీవెన్స్‌లో అందజేయొచ్చన్నారు.