పిల్లల్ని భాగస్వామ్యం చేస్తున్నారు: కందుల దుర్గేష్

పిల్లల్ని భాగస్వామ్యం చేస్తున్నారు: కందుల దుర్గేష్

AP: విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం ప్రారంభమైంది. ఈ బాలోత్సవానికి మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 'రాజమండ్రిలో జరిగిన బాలోత్సవంలో పాల్గొన్నాను. మొక్కుబడి సభలా కాకుండా.. పిల్లల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను బయటకి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఈ బాలోత్సవం' అని పేర్కొన్నారు.