జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

జిల్లాలో పిడుగులతో కూడిన  వర్షాలు

SRD: తెలంగాణలో వాతావరణం మార్పులతో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.