విద్యుత్ కాంతుల్లో మెరుస్తున్న విశాఖ నగరం

విద్యుత్ కాంతుల్లో మెరుస్తున్న విశాఖ నగరం

VSP: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో నగరం సరికొత్త హంగులను అద్దుకుంది. విదేశీ అతిథులకు స్వాగతం పలికేలా ప్రధాన కూడళ్లలో వినూత్న ఆకృతులను నిర్మించి, రంగురంగుల విద్యుత్ దీపాలతో ధగధగలాడేలా అలంకరించారు. నగరంలోని ప్రధాన రహదారులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మించారు. సుందరంగా తీర్చిదిద్దిన నగర రూపురేఖలను చూసి స్థానికులు అబ్బురపోతున్నారు.