డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కమిషనర్
కడప నగర శివారులోని డంపింగ్ యార్డ్‌ను కమిషనర్ రాకేష్ చంద్ర పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (8 ఎకరాలు), వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ (40 ఎకరాలు) ఏర్పాటుపై సమీక్షించారు. విండ్రో కంపోస్టింగ్ విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్‌జీటీ మార్గదర్శకాల ప్రకారం ఘన వ్యర్థాల నిర్వహణను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.