హర్షవీణ సెల్ఫీ వీడియోతో మరోసారి సంచలనం(1/1)
అన్నమయ్య: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఉద్రిక్తత కొనసాగుతోంది. హర్ష వీణ మరోసారి సెల్ఫీ వీడియో విడుదల చేసి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఎమ్మెల్యే మళ్లీ ప్రజల్లోకి రావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.