రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

AP: విశాఖలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రేపు ఏయూలో నిర్వహించే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. మహిళల ఆరోగ్యానికి ఏర్పాటు చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక వైద్య శిబిరాలపై సీఎం ప్రసంగం చేయనున్నారు.