బాలిక అదృశ్యం.. కేసు నమోదు

WGL: బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సోమవారం నర్సంపేట పోలీసులు తెలిపారు. నర్సంపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక(17) అదృశ్యమైంది. ఈనెల 26న బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఆమె కనిపించలేదు. బాలిక ఆచూకీ కోసం ఎంత గాలించినా తెలియకపోవడంతో సోమవారం ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.