VIDEO: పింఛా ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల
అన్నమయ్య: టీ.సుండుపల్లిలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పింఛ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో, ప్రాజెక్టు గేట్లు తెరిచి, సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు అధికారులు దిగువన ఉన్న గ్రామాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలని సూచించారు.