డ్రగ్స్‌పై యువతకు అవగాహన కార్యక్రమం

KMR: జిల్లా టేక్రియల్ గ్రామంలో దేవునిపల్లి ఎస్సై రంజిత్ కుమార్ ప్రజలకు శుక్రవారం పలు సూచనలు చేశారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.