వెల్లంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వెల్లంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NTR: వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లాంఛనంగా ప్రారంభించారు. రైతులు పండిస్తున్న ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉండటమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తూకంలో పారదర్శకత పాటిస్తూ.. చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు.