అనాథ మృతదేహానికి దహన సంస్కారాలు
GDWL: అయిజ మున్సిపాలిటీ 20వ వార్డుకు చెందిన అనాథ మహిళ చాకలి తిప్పమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ ఉషన్ బి ఇస్మాయిల్ సాకారంతో మున్సిపల్ సిబ్బంది అనాథ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. మానవత్వంతో ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది సేవలను స్థానిక ప్రజలు కొనియాడారు.