'రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలి'
వరంగల్: పంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి డా. సత్య శారద అన్నారు. నిన్న కలెక్టరేట్ మందిరంలో తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ అధికారులతో, సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రిజర్వేషన్లతోపాటు పోలింగ్ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఎంపీడీవోలకు ఆదేశించారు.