జిల్లాలో 70వేల ఎకరాల్లో నీట మునిగిన పంట

GNTR: గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 70 వేల ఎకరాల్లో వరి పంటలు నీట మునిగి చెరువులను తలపించాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ. 10 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు మళ్లీ నాట్లు వేసేందుకు సమయం లేక కష్టపడుతున్నారు.