యువకుల మధ్య చెలరేగిన వివాదం.. రోడ్డుపైనే ఘర్షణ

యువకుల మధ్య చెలరేగిన వివాదం.. రోడ్డుపైనే ఘర్షణ

వరంగల్: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని భవాని కుంటతండాకు చెందిన యువకుల మధ్య హోలీ పండుగ సందర్భంగా శుక్రవారం ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగడంతో పరస్పర దాడులకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పిన వినకుండా ఆడవారు, మగవారు రోడ్డుపైనే ఘర్షణ పడ్డారు. రెండు గ్రూపులను చదరగొట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.