'సంతాన ప్రాప్తిరస్తు' నుంచి మరో సాంగ్ రిలీజ్

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా సినిమా నుంచి 'మరి మరి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడాడు.