రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
PPM: పార్వతీపురం-నర్సిపురం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. నర్సిపురం హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తోన్న వెంకటనాయుడు విధుల నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగుల్లో ఉన్న అతనిని తోటి వాహనదారులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.