సీఎంను కలిసిన ఎమ్మెల్యే

RR: ఎమ్మెల్యే కాలే యాదయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలగంటి మధుసూదన్ రెడ్డి అంబేద్కర్ సచివాలయంలో చేవెళ్ల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు, రోడ్డు మరమ్మత్తులపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. స్పందించిన సీఎం రేవంత్ నిధుల మంజూరుకు సుముఖత చూపినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.