నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇవాళ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. చిన్నచింతకుంట మండలం లాల్ కోట గ్రామంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.