రూ.14.6 కోట్లతో 'విశ్రామ్ సదన్' ఏర్పాటు
KRNL: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో రోగుల అటెండెంట్ల కోసం రూ.14.6 కోట్లతో 'విశ్రామ్ సదన్' ఏర్పాటు చేయనున్నట్లు అదనపు DME & సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. పవర్ గ్రిడ్ CSR నిధులతో NBCC ఆధ్వర్యంలో G+3 అంతస్థుల 150 పడకల ఆధునిక వసతి భవనం నిర్మాణం జరుగనున్నట్లు చెప్పారు. సింగిల్, ట్విన్ రూములు, డార్మిటరీ, మహిళా వసతి వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి.