మోపిదేవి స్వామిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

కృష్ణా: మోపిదేవి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ హరి హరనాథ్ శర్మ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి విచ్చేసిన ఆయనను ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో ఘనంగా ఆహ్వానించారు.