సీఎంలతో మోదీ వర్చువల్ సమావేశం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలపై ఇందులో చర్చించనున్నారు. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. టీమిండియా స్ఫూర్తితో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడానికి ఈ భేటీని ఏర్పాటు చేశారు.