టీకాలతో చిన్నారులకు రక్షణ
MNCL: టీకాలతో చిన్నారులలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమా శ్రీ కోరారు. బుధవారం జన్నారం మండలంలోని ఇందన్ పల్లి, కలమడుగు, జన్నారం, రాంపూర్, తిమ్మాపూర్, తదితర అన్ని గ్రామాలలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించారు. టీకాలు చిన్నారులను పోలియో, తట్టు, తదితర వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయన్నారు.