ఘనంగా పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
CTR: పుంగనూరు పట్టణం బసవరాజ బాలుర ఉన్నత పాఠశాలలో 1984-85లో పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పడు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. 40 సంవత్సరాల ముందు వారి పాఠశాల జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. అందరూ ఎంతో సంతోషంగా గడిపారు.