అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

సత్యసాయి: ధర్మవరం పట్టణం రామ్నగర్‌లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి సత్య కుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.22 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ధర్మవరం పట్టణాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని చెప్పారు.