సీఎంకు మంత్రి సంధ్యారాణి ప్రత్యేక విజ్ఞప్తి
AP: అరకు నియోజకవర్గ సమస్యలను మంత్రి సంధ్యారాణి.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఏరియా ఆస్పత్రిని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ది చేయాలని విన్నవించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. సాలూరు, పాచిపెంట మీదుగా అరకు వరకు రహదారి విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.