నేడు రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు
ఇవాళ రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం సహా పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు. ఈ క్రమంలో తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. అలాగే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై మరోసారి చర్చ జరగనున్నట్లు సమాచారం.