యధేచ్చగా ఇసుక రవాణా.. పట్టించుకోని అధికారులు

యధేచ్చగా ఇసుక రవాణా.. పట్టించుకోని అధికారులు

వరంగల్: అధికారులు అవినీతికి అండగా నిలుస్తున్నారు. ఉప్పరపల్లి, అర్పణపల్లి, వెంకటగిరి గ్రామాలలో ప్రవహించే వట్టివాగు నుంచి రాత్రి వేళలో వందల కొద్ది ట్రాక్టర్లలో ఇసుక ప్రతిరోజూ బయటకు తీస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరిపి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇది సజావుగా సాగేందుకు అధికారులు నెలవారీ మామూళ్లు అందుకుంటున్నారని ప్రజల్లో చర్చ జరుగుతుంది.