మొజ్తాబా ఖమేనీపై వార్తలను ఖండించిన ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని రష్యాకు తరలించినట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. ఇదొక కొత్త తరహా మానసిక యుద్ధమని పేర్కొంది. ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన, షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వారు ప్రజల మధ్యే ఉంటారని అని రష్యాలో ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ పేర్కొన్నారు.