‘నేషనల్ హెరాల్డ్ కేసు అంతా బోగస్’

‘నేషనల్ హెరాల్డ్ కేసు అంతా బోగస్’

నేషనల్ హెరాల్డ్ కేసు తప్పుడు కేసు అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కొట్టిపారేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేతలపై కక్ష సాధింపు కోసమే ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ కేసు పూర్తిగా నిరాధారమని, ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా.. చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.