VIDEO: అర్ధవీడులో అమరజీవికి ఘన నివాళులు
ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్ధవీడు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఎంపీడీవో ఖాసింపీరా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.