'విద్యార్థి దశనుండే అవగాహన ఉండాలి'
ASR: విద్యార్థి దశనుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సోమవారం కొయ్యూరు కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జీటీడబ్ల్యూఏ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. మహిళా సాధికారత, భద్రత, సమాన హక్కులపై అవగాహన కల్పించామన్నారు.