ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన MPDO
ASR: మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలోని కొండవాలు పడిపోవడానికి సిద్దంగా ఉన్న ఇళ్ళలోని కుటుంబాలను మంగళవారం పునరావాస కేంద్రాలకు పంపినట్లు అరకులోయ ఎంపీడీవో లవరాజు తెలిపారు. మండలంలోని లోతేరు పంచాయతి, ధనరంగినివలస గ్రామం నుంచి 17 మందికి, మడగడ పంచాయితి, దొరగుడ గ్రామం నుంచి 18 మందికి ఆయ గ్రామాల అంగన్వాడీలలో పునరావాసం కల్పించినట్లు ఎంపీడీవో తెలిపారు.