కన్నీటి మధ్య కలల కోసం పోరాటం

కన్నీటి మధ్య కలల కోసం పోరాటం

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని ఉప్పుగుండూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కొలకలూరి నాగార్జున అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన కుమార్తె మమత, స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తండ్రి మరణించిన విషాదంలోనూ, తన లక్ష్యాన్ని వీడకుండా బుధవారం పరీక్షకు హాజరైంది. ఈ సంఘటనతో స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.