గిద్దలూరులో పర్యటించిన కమిషనర్

గిద్దలూరులో పర్యటించిన కమిషనర్

ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీలోని వార్డుల్లో బుధవారం మున్సిపల్ కమిషనర్ రమణబాబు పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెత్తను రోడ్లపై వేయరాదన్నారు. తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి ఇంటి వద్దకు వచ్చే చెత్త రిక్షాలోనే వేయాలన్నారు. రోడ్లను, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యవంతంగా ఉండొచ్చన్నారు.