జాబ్ మేళాలో 58 మందికి ఉద్యోగాలు
NTR: నందిగామ ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో మొత్తం 130మంది అభ్యర్థులు పాల్గొనగా 58 మందిని ఎన్నిక చేయడం జరిగిందని 19 మందితో షార్ట్ లిస్ట్ చేయడం జరిగిందన్నారు. యువత పోటీ ప్రపంచంలో డిగ్రీ సర్టిఫికెట్లే కాకుండా నైపుణ్యాలు ప్రదర్శిస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు.