ఆలయాలను పునరుద్ధరించాలి

NZB: బోధన్ పట్టణంలో శిధిలావస్థకు చేరిన ప్రాచీన ఆలయాలను పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు. పట్టణంలోని బురుడు గల్లీలో గల ఏనుగు మైసమ్మ, వేయి కళ్ళ పోచమ్మ ఆలయాలు శిధిలావస్థకు చేరాయి. ఈ ఆలయాల వద్ద భక్తులు నిత్యం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పట్టణ అభివృద్ధి కమిటీ చొరవ చూపి ఆలయాల పునరుద్ధరణకు ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.