గుంటూరు డీఈఓగా షేక్ సలీం బాషా
GNTR: గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా (డీఈఓ)గా షేక్ సలీం బాషాను నియమిస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కోనసీమ డీఈఓగా పనిచేసిన ఆయనను గుంటూరుకు బదిలీ చేశారు. గుంటూరు డీఈఓ రేణుకను ప్రకాశం జిల్లాకు బదిలీ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు ఇచ్చారు.