తుక్కు దుకాణంలో చెలరేగిన మంటలు

తుక్కు దుకాణంలో చెలరేగిన మంటలు

SDPT: దుబ్బాక పట్టణంలోని అంగడి బజార్‌లో ఉన్న ఓ తుక్కు దుకాణంలో నేడు ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తుక్కు దుకాణంలోని నిల్వ ఉంచిన పాత సామగ్రి, పైపుల వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న రెండు పాత ద్విచక్ర వాహనాలకు మంటలు వ్యాపించి ఆ ప్రాంతమంతా పొగ అలముకుంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేశారు.