ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

ఇండోర్ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

KMR: ఇందిరా గాంధీ స్టేడియం కామారెడ్డి ప్రాంగణంలో రూ. 800 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియానికి శనివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు. ఈ స్టేడియంలో బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, షూటింగ్ రేంజ్, టేబుల్ టెన్నిస్ హాల్, యోగా హాల్, జిమ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.