HYD నుంచే నక్షత్రాలు, గ్రహాలను చూడొచ్చు..!

HYD: సెంట్రల్ యూనివర్సిటీలో మినీ అబ్జర్వేటరీ అందుబాటులోకి వచ్చింది. నక్షత్రాలు, గ్రహాలను ఇక్కడి నుంచే టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. ఇప్పటికే ఉస్మానియా ఆధ్వర్యంలో నిజం అబ్జర్వేటరీ, ఐఐటీలో మరో కేంద్రం అందుబాటులో ఉంది. దీని ద్వారా వాయు కాలుష్య తీవ్రతను సైతం అంచనా వేయొచ్చని, నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణాన్ని అధ్యయనం చేయొచ్చని ప్రొఫెసర్ ఉదయగిరి తెలిపారు.