దొండపాడు సర్పంచ్‌గా వెంకయ్యకు భారీ మెజారిటీ
SRPT: చింతలపాలెం మండల పరిధిలోని దొండపాడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుడు చెన్నకేసి వెంకయ్య యాదవ్ రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్నారు. బుధవారం ఓట్ల లెక్కింపులో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 593 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో పార్టీ శ్రేణులు, బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.