ఆలయాల్లో శ్రావణమాస ఆఖరి శనివారం ప్రత్యేక పూజలు

NZB: రామారెడ్డి మండలం మోసంపూర్ గ్రామంలో శ్రావణమాసం ఆఖరి శనివారం పురస్కరించుకొని హనుమాన్ భక్తులు, రామ భక్తులు భక్తితో పూజలు చేశారు. హనుమాన్ చాలీసా నామస్మరణ చేస్తూ స్వామివారికి నైవేద్యం సమర్పించుకున్నారు. మహిళా భక్తులు మంగళహారతులతో స్వామివారిని కీర్తించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు భరద్వాజ్ మహారాజ్, పూజారి ఉమకాంతరావు పాల్గొన్నారు.