గ్రామ సర్పంచ్‌గా ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవం
RR: చేవెళ్ల మండలం చన్వెళ్లి గ్రామ సర్పంచ్‌గా గుండన్న గారి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్‌గా ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యే వారిని శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్తులకు నిత్యం అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.