యాడికిలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

యాడికిలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

ATP: వరల్డ్ ఓరల్ హెల్త్ అవేర్‌నెస్ డే సందర్భంగా డాక్టర్ ప్రశాంతి యాడికి మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు గురువారం దంత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు రెండు పూటలా బ్రష్ చేసుకోవాలని సూచించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే దంతాలు పటిష్టంగా ఉండాలన్నారు.