VIDEO: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి హన్సిక

TPT: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీనటి హన్సిక కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల పలువురు అభిమానులు, భక్తులు ఆమెతో ఫోటోలు దిగారు.