రూ.14.20 కోట్లు పెట్టింది ఇందుకేనా?
IPL 2026 వేలంలో ప్రశాంత్ వీర్‌ను CSK రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ చేయగల ఇతడిని జడేజాకు ప్రత్యామ్నాయంగా తీసుకుంది. నిన్న RCBపై 43 పరుగులతో బ్యాటింగ్‌లో రాణించాడు. అయితే, అతడితో కెప్టెన్ ఇప్పటివరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. 'కేవలం బ్యాటింగ్ కోసమే అయితే ఇంత భారీ ధర అవసరమా?' అంటూ SMలో చర్చ జరుగుతోంది.