ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. వ్యక్తిగత ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే, టీ20 బ్యాటర్ల జాబితాలో యువ ఆటగాడు అభిషేక్ శర్మ, బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నెంబర్.1 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మరోవైపు, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.