నాదెండ్ల ఆరోగ్యంపై వదంతులు.. క్లారిటీ ఇదే
GNTR: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు ఆరోగ్యంపై పలు వార్తలు సోషల్ మీడియాల్ వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆయన కుమారుడు, మంత్రి కార్యాలయం స్పందించింది. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని, నిరాధారమైన వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేయవద్దని కోరింది. ప్రజలు వదంతులను నమ్మవద్దని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.