ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా.. సాంబశివరావు

BHPL: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం నూతన ప్రధానోపాధ్యాయుడిగా సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ, కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఉన్నతీకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనను సత్కరించారు.